‘వేతన బకాయిలు చెల్లించాలి’
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:28 PM
మండలంలోని పురిటిపెంట పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు.
గజపతినగరం,జూన్ 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని పురిటిపెంట పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు. బుధవారం పురిటిపెంట గ్రామ సచి వాలయం వద్ద పారిశుధ్య కార్మికులతో కలిసి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బి. రామకృష్ణ, భాస్కరరావు, గోవింద, వంశీ, చిన్న పాల్గొన్నారు.
‘కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు అందజేయాలి’
భోగాపురం, జూన్3(ఆంధ్రజ్యోతి): కాంంట్రాక్టు ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు నిలిచిపోయాయని వెంటనే అందజేయాలని భోగాపురం ఏపీ ఎన్జీవో భోగా పురం తాలూకా అధ్యక్షులు కొమ్మూరు దుర్గారావు, కార్యదర్శిఅప్పలనాయుడు ఒక ప్రక టనలో డిమాండ్‌చేశారు. ఒక్క వైద్యశాఖలోనే కీలకమైన సేవలందిస్తున్న స్టాప్ నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు, హెల్త్‌అసిస్టెంట్లు, లేబ్ టెక్నీషియన్లు సుమారు ఐదు వేలు మంది ఉన్నారని తెలిపారు.