Share News

మోకాళ్లపై వీఆర్‌ఏల నిరసన

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:41 AM

రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా వీఆర్‌ఏలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.

మోకాళ్లపై వీఆర్‌ఏల నిరసన
మోకాళ్లపై కూర్చొని నిరసన చేస్తున్న వీఆర్‌ఏలు

రేగిడి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా వీఆర్‌ఏలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. పేస్కేల్‌తో పాటు, అర్హులైన వారికి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అసోసియేషన్‌ ప్రతినిధులు రాజు, జగన్‌, పాదాలరావు, బాలరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:41 AM