Voting అర్హులందరికీ ఓటు హక్కు
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:53 PM
Voting Rights for All Eligible Citizens నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జిల్లా ప్రత్యేక అధికారి జె.వెంకటమురళి తెలిపారు. సోమవారం సోమవారం కలెక్టరేట్‌లో పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జిల్లా ప్రత్యేక అధికారి జె.వెంకటమురళి తెలిపారు. సోమవారం సోమవారం కలెక్టరేట్‌లో పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ప్రచురించిన ఓటర్ల జాబితా ఆధారంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి చేపట్టిన ప్రీ ఫీల్డ్ ఎన్యూమరేషన్ ప్రక్రి యపై చర్చించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారితో పాటు జిల్లాలో కొత్తగా స్థిరపడిన వారి నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఇతర సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందొచ్చన్నారు. నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేసి జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ ఆర్.వైశాలి, డీఆర్వో హేమలత, ఆర్డీవో మాధురి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.