ఓటర్ల నమోదు పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:39 PM
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు.
బొబ్బిలి రూరల్, జూలై 12(ఆంధ్రజ్యోతి): కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఎం.బూర్జవ లసలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీఎల్‌వోలు, సిబ్బందితో మాట్లాడుతూ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు జాబితాలో నమోదు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అలసత్వం ప్రదర్శిస్తే సహించ బోమని హెచ్చరించారు.
‘సర్’ త్వరితగతిన పూర్తిచేయాలి
బాడంగి, జూలై 12(ఆంధ్రజ్యోతి): డిజిటలైజేషన్, ఏఎస్డీడీ లిస్టులను తనిఖీ చేసి సర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సిబ్బందికి ఎంపీడీవో డీవీ శ్రీలత సూచించారు. ఆదివారం బాడంగి సచివాలయం పరిధిలోని 184,185, 186 పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దేవరపల్లి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ధనుంజయరావు పాల్గొన్నారు.