ఓటర్ల జాబితాలను సరిచేయాలి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:06 AM
వార్డులు వారీగా తయారు చేసిన ఓటర్ల జాబి తాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సరిచే యాల్సిన బాధ్యత ప్రణాళికా విభాగం సిబ్బం దిపై ఉందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి కోరారు.
విజయనగరం టౌన్, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): వార్డులు వారీగా తయారు చేసిన ఓటర్ల జాబి తాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సరిచే యాల్సిన బాధ్యత ప్రణాళికా విభాగం సిబ్బం దిపై ఉందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి కోరారు. మంగళవారం విజయనగరంలోని నగరపాలక సంస్థ కార్యాల యంలో ప్రణాళికా సిబ్బందితో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డులు వారీగా ఓటరు జాబితాలకు సంబందిం చి వివరాలను పరిశీలించిన అనంతరం అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రకారం పరిశీలన ప్రక్రి యను వేగవంతం చేయాలని కోరారు. కార్యకమ్రంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు హరిబాబు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.