Share News

Voters ఓటర్లు తగ్గారు

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:55 PM

Voter Count Declines ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది. అయితే గత జాబితాను పోల్చి చూస్తే డబుల్‌ ఎంట్రీలు, మరణాలు , వలసలు తదితర కారణాలతో జిల్లా వ్యాప్తంగా 75,119 మంది ఓటర్లు తగ్గారు.

Voters  ఓటర్లు తగ్గారు

  • మన్యం ఓటర్లు 7,15,443 మంది

  • గతంతో పోలిస్తే 75,119 మంది వరకు తగ్గిన వైనం

  • ఆగస్టు 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ

  • అక్టోబరు 3న తుది జాబితా విడుదల

పార్వతీపురం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది. అయితే గత జాబితాను పోల్చి చూస్తే డబుల్‌ ఎంట్రీలు, మరణాలు , వలసలు తదితర కారణాలతో జిల్లా వ్యాప్తంగా 75,119 మంది ఓటర్లు తగ్గారు. దీనిపై ఆగస్టు 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబరు 28 వరకూ వాటికి పరిష్కారం చూపుతారు. అనంతరం తుది ఓటర్ల జాబితా అక్టోబరు 3న విడుదల చేస్తారు. గతంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 7,90,562 మంది ఓటర్లు ఉండగా.. సర్‌ ప్రక్రియ తర్వాత ఆ సంఖ్య 7,15,443గా మారింది.

నియోజకవర్గాల వారీగా చూస్తే..

- సాలూరులో గతంలో 2,05,985 మంది ఓటర్లు ఉండగా.. సర్‌ పక్రియ తర్వాత 1,84,089 మంది ఓటర్ల జాబితాలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 21,896 ఓట్లు తొలగించారు. ఇందులో మృతి చెందిన ఓటర్లు 11,975 మంది , చిరునామా లభించని వారు 3062 మంది , వలస వెళ్లిపోయిన వారు 3987 మంది , డబుల్‌ ఎంట్రీలు 2819, ఇతరుల ఓట్లు 53 వరకు ఉన్నాయి. మొత్తంగా ముసాయిదా జాబితా ప్రకారం మహిళలు 94,471 మంది, పురుషులు 89,615 మంది, ఇతరులు ముగ్గురు ఓటర్లు ఉన్నారు.

- పార్వతీపురంలో 1,91,718 మంది ఓటర్లకు గాను 1,73,266 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 87,815మంది, పురుషులు 85,443 మంది, ఇతరులు 8 మంది ఓటర్లు ఉన్నారు.మృతి చెందిన వారు 7,362, చిరునామా లభించని వారు 3,231, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు 5,721, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 2,130, ఇతరులు 8 మంది ఓటర్లను తొలగించారు.

- కురుపాంలో కురుపాంలో 1,95,916 ఓటర్లకు గాను 1,77,700 మంది తుది జాబితాలో ఉన్నారు. వారిలో పురుషులు 86,331 మంది మహిళలు 91,328 మంది ఇతరులు 41 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మృతి చెందిన వారు 9,111 మంది , నివాసం లేనివారు 2,092 మంది , శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు 4,701 మంది , డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 2,297 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు. మొత్తంగా 18,216 ఓట్లు తొలగించారు.

- పాలకొండలో 1,96,943 మంది ఓటర్లకు గాను 1,80,388 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 92,575 మంది, పురుషులు, 87,799 మంది, ఇతరులు 14 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 16,555 ఓట్లు తొలగించారు. వారిలో మృతి చెందిన ఓటర్లు 7,555 మంది, చిరునామా లేనివారు 2,895 మంది, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు 2,875 మంది, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 3,216 మంది , ఇతరులు 14 మంది వరకూ ఉన్నారు.

అభ్యంతరాలుంటే దరఖాస్తులు ఇలా..

ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే బీఎల్‌వో లేదా తహసీల్దార్‌ లేదా ఎన్నికల అధికారికి వివరాలు అందజేయాలి. జాబితాలో పేరు, చిరునామ, ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే శుక్రవారం నుంచి ఆగస్టు 30 వరకూ అధికారులకు వివరాలతో దరఖాస్తు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన కొత్త వారంతా ఫారం -6, ఎనగ్జర్‌ డి సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలి. సర్‌ ప్రక్రియలో వివరాలు సమర్పించిన వారు లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందుకున్నవారు గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలను ఏఈఆర్‌వో, ఈఆర్‌వోకి అందజేయాలి.

Updated Date - Jul 31 , 2026 | 11:55 PM