Share News

Vote Freely స్వేచ్ఛగా ఓటేయండి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:11 AM

Vote Freely ‘జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని.. స్వేచ్ఛగా ఓటేయండి.’ అని ఆంధ్రా అధికారులు కొఠియా గ్రూప్‌ గిరిజనులకు సూచించారు. ఒడిశా అధికారులు, రాజకీయ నాయకులు ఎలాంటి ఇబ్బందులు కలుగజేసినా తక్షణమే తమకు తెలియజేయాలని కోరారు. కొఠియాలో ఎన్ని‘కలకలం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై జిల్లా అధికారులు స్పందించారు.

Vote Freely స్వేచ్ఛగా ఓటేయండి
కొఠియా గ్రామ గిరిజనులతో మాట్లాడుతున్న ఆంధ్రా అధికారులు

  • కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో పర్యటన

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

సాలూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ‘జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని.. స్వేచ్ఛగా ఓటేయండి.’ అని ఆంధ్రా అధికారులు కొఠియా గ్రూప్‌ గిరిజనులకు సూచించారు. ఒడిశా అధికారులు, రాజకీయ నాయకులు ఎలాంటి ఇబ్బందులు కలుగజేసినా తక్షణమే తమకు తెలియజేయాలని కోరారు. కొఠియాలో ఎన్ని‘కలకలం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం సాలూరు రెవెన్యూ, పోలీసు అధికారులు కొఠియా గ్రూప్‌ పరిధి పట్టుచెన్నారులో పర్యటించారు. తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో పార్వతి, సీఐ రామకృష్ణ, కొఠియా సీఐ దశరథ్‌తోపాటు పలువురు అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి గిరిజన గ్రామస్థులతో మాట్లాడారు. ఎన్నికలు జరిగితే కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వాల నుంచి అందే సంక్షేమపథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఒడిశా అధికారులు తొలగించిన తెలుగు భాషలో ఉన్న అనేక బోర్డులను యథా స్థానంలో ఉంచారు.

Updated Date - Oct 25 , 2026 | 12:11 AM