స్వేచ్ఛగా ఓటేయండి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:19 AM
నగరంలో పైడితల్లమ్మ పండగతో పాటు ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేం దుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది.
ప్రలోభాలకు లొంగవద్దు
ఎస్పీ దామోదర్
నగరంలో పోలీసుల కవాతు
విజయనగరం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): నగరంలో పైడితల్లమ్మ పండగతో పాటు ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేం దుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ నుంచి గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట జంక్షన్, లైన్స్ క్లబ్ జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్, జొన్నగుడ్డి వరకు పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగవద్దని, పోలీసుశాఖ అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవరోధాలు కల్పించే అసాంఘిక శక్తుల తాట తీయాలని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారు లు, సిబ్బందిని ఆదేశించారు. ప్రాదేశిక నామినేషన్ ప్రక్రియలో జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటను చోటు చేసుకోలేదన్నారు. అమ్మవారి పండగ, ప్రాదేశిక ఎన్నికలు వరుసగా వచ్చినందుకు పోలీసులు అంకిత భావంతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని అన్నారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలైన జొన్నగుడ్డి, బాబామెట్ట, పూల్‌బాగ్, వైఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో రాత్రి గస్తీ నిర్వహించేందుకు 100 మంది పోలీసులను కేటాయిస్తామని తెలిపారు. కార్యక్ర మంలో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, సీఐలు ఏవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, టి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, డీడీ నాయుడు, ఆర్‌ఐలు పి.శ్రీనివాసరావు, పలువురు ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.