Share News

అభివృద్ధిని చూసి ఓటేయండి

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:20 AM

విజయనగరం పట్టణంలో గత రెండేళ్లుగా జరుగుతు న్న అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థికి ఓటేయండ ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు.

అభివృద్ధిని చూసి ఓటేయండి

  • మంత్రి శ్రీనివాస్‌

  • కూటమి మేయర్‌ అభ్యర్థి భార్గవి తరపున ప్రచారం

విజయనగరం టౌన్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): విజయనగరం పట్టణంలో గత రెండేళ్లుగా జరుగుతు న్న అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థికి ఓటేయండ ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. నగరంలోని 10, 27, 35, 36వ డివిజన్లలో ఆదివారం నిర్వ హించి న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క విజయనగరం నియోజకవర్గానికే రూ.507 కోట్లు నిధులను మంజూ రుచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కూటమి మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, 9వ డివిజన్‌ అభ్యర్థి సోము భార్గ వి, 10వ డివిజన్‌ అభ్యర్థి కంది మురళీనాయుడు, 27వ డివిజన్‌ అభ్యర్థి బర్ల సత్యవేణి, 35వ డివిజన్‌ అభ్యర్థి కుందేటి గణేష్‌ పాల్గొన్నారు.

నగర కార్పొరేషన్‌లో మేయర్‌ స్థానం ఓసీ మహిళలకు కేటాయించినప్పటికీ, ప్రతిపక్షం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించినప్పటికీ బీసీలంతా కూటమి వైపు మొగ్గు చూపడం ఎంతో ఆనందంగా ఉందని కూటమి మేయర్‌ అభ్యర్థి అవనా పు భార్గవి ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం విజయనగరంలోని అయ్యన్నపేట ప్రాంతంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి ప్రచారం నిర్వహించారు. తన మామయ్య అవనాపు సూరి బాబు గతంలో మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశా రని, తన అత్త నాలుగు పర్యాయాలుగా వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారని చెప్పారు. తన భర్త అవనాపు విజయ్‌ కూడా నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా రని తెలిపారు. ఎమ్మెల్యే అదితి ఆశీస్సులతో బరిలోకి దిగానని, తనను ఆదరించి మేయర్‌గా గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే రూ.44కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. నగరంలోని వైఎస్సాఆర్‌ నగర్‌ కాలనీలో రూ.12కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామ న్నారు. మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ నగరా నికి అదనంగా రూ.27కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఈ ప్రచారంలో పలువురు కూటమి కార్పొరే ట్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 12:20 AM