Tribal Commission Chairman 25న జిల్లాకు గిరిజన తెగల కమిషన్ చైర్మన్ రాక
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:33 PM
Visit of Tribal Commission Chairman to the District on 25th రాష్ట్ర గిరిజన తెగల కమిషన్ చైర్మన్ సోల బొజ్జిరెడ్డి ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 25న ఆయన విజయవాడ నుంచి బయల్దేరి జిల్లాకు చేరుకుంటారు. మొదటి రోజు మన్యంలో వివిధ విద్యా సంస్థలు, గిరిజన హాస్టళ్లను సందర్శిస్తారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తారు.
పార్వతీపురం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన తెగల కమిషన్ చైర్మన్ సోల బొజ్జిరెడ్డి ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 25న ఆయన విజయవాడ నుంచి బయల్దేరి జిల్లాకు చేరుకుంటారు. మొదటి రోజు మన్యంలో వివిధ విద్యా సంస్థలు, గిరిజన హాస్టళ్లను సందర్శిస్తారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తారు. 26న ఉదయం 9 గంటలకు నుంచి పది గంటల వరకు వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఉదయం 10.15 గంటలకు కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయం త్రం ఐదు గంటల వరకు మైనింగ్ ప్రాంతంతో పాటు చినగూడబ, చినఖేర్జల గ్రామాలను సందర్శించి స్థానిక గిరిజనుల స్థితిగతులను పర్యవేక్షించనున్నారని గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు వెల్లడించారు.