Share News

విజిబుల్‌ పోలీసింగ్‌ తప్పనిసరి: ఎస్పీ

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:49 PM

గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ తప్పనిసరి ఎస్పీ మాధవరెడ్డి అన్నారు.

విజిబుల్‌ పోలీసింగ్‌ తప్పనిసరి: ఎస్పీ
రికార్డులు తనిఖీ చేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ తప్పనిసరి ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌, రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించి ప్రజలకు చట్టాలు, సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. అసాం ఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయనతో పాటు ఏఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రంగనాథం, ఎస్‌ఐ రాజేశ్‌ ఉన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:49 PM