ఉద్యమకారులపై కక్షపూరిత చర్యలు తగవు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:33 AM
రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారులపై ప్రభుత్వాలు కక్షపూరిత చర్యలు ఆపా లని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు డి.రాము, చినబాబులు డిమాండ్ చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు
విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 17(ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారులపై ప్రభుత్వాలు కక్షపూరిత చర్యలు ఆపా లని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు డి.రాము, చినబాబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవా రం స్థానిక కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వ ర్యంలో పేపర్ లీకేజీలు, అవకతవకలు జరుగుతున్నా, కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. రాష్ట్రంలో వసతి గృహాలకు సొంత భవనాలు లేక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. జీవో నెంబరు 77 తెచ్చి పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబ ర్స్‌మెంటు రద్దు చేయడం దారుణమన్నా రు. ఈ కార్యక్ర మంలో కమిటీ ప్రతినిధులు రవి, శిరీష, వెంకీ, భారతి, ర మేష్, సూరిబాబు, నాని తదితరులు పాల్గొన్నారు.