Share News

ఆర్టీసీ బస్సును అడ్డుకున్న గ్రామస్థులు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:05 AM

పట్టణంలోని జి.అగ్రహారం గుండా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆ గ్రామస్థులు గురువారం అడ్డుకున్నారు.

 ఆర్టీసీ బస్సును అడ్డుకున్న గ్రామస్థులు

చీపురుపల్లి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జి.అగ్రహారం గుండా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆ గ్రామస్థులు గురువారం అడ్డుకున్నారు. తమ గ్రామం వైపు ఉన్న సర్వీసు రోడ్డులో అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని వేరే చోటుకు మార్చాలని కోరుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంతో బస్సును అడ్డుకుని, తమ నిరసన తెలిపారు. కొత్తగా నిర్మించిన ఆర్వోబీకి ఆనుకుని, జి.అగ్రహారం వైపు సర్వీసు రోడ్డు వేశారు. అయి తే, ఈ రోడ్డుకు అడ్డంగా విద్యుత్‌ స్తంభం ఉంది. దీనివల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దీన్ని వేరే ప్రదేశానికి మార్చాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరు తున్నారు. ఈనేపథ్యంలో స్థానికులు గురువారం రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, సంబంఽ దిత అధికారులతో మాట్లాడారు. స్తంభాన్ని త్వరలోనే వేరే ప్రదేశానికి తరలిస్తా మని సంబంధితఅధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.

Updated Date - Jan 30 , 2026 | 12:05 AM