Village Health Clinics అందుబాటులోకి విలేజ్ హెల్త్ క్లినిక్‌లు
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:47 PM
Village Health Clinics Become Available జిల్లాలో రూ.4.62 కోట్లతో నిర్మించిన 11 విలేజ్ హెల్త్ క్షినిక్‌లు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం వాటిని వర్చువల్‌గా మంత్రి సత్యకుమార్‌యాదవ్ ప్రారంభించారు.
పార్వతీపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ.4.62 కోట్లతో నిర్మించిన 11 విలేజ్ హెల్త్ క్షినిక్‌లు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం వాటిని వర్చువల్‌గా మంత్రి సత్యకుమార్‌యాదవ్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొండలో ఏడు, సాలూరులో రెండు, కురుపాం నియోజకవర్గంలో రెండు క్లినిక్‌లు అందు బాటులోకి వచ్చాయన్నారు. గ్రామీణ, గిరిజన ప్రజలకు సత్వర ప్రాథమిక వైద్యసేవలు అందించ డమే వాటి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పి.విజయలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు పద్మావతి, విజయపార్వతి, ప్రోగ్రాం అధికారులు రవికుమార్‌రెడ్డి, జగన్మోహనరావు, విజయమోహన్, ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు కిషోర్, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రదీప్, జిల్లా పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.