గ్రామ ముఖద్వారం ప్రారంభం
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:17 AM
ఎం.రాజపురం గ్రామ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఏర్పాటు చేశారు.
వీరఘట్టం, జనవరి14 (ఆంధ్రజ్యోతి): ఎం.రాజపురం గ్రామ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఏర్పాటు చేశారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ముఖ ద్వారాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, కర్నేన అప్పలనాయుడు, ఉదయాన ఉదయ్ భాస్కర్, తూముల రమేష్, చింతా ఉమా, గర్భాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.