Share News

Unanimous Decisions ఏకగ్రీవాలతో పల్లెల అభివృద్ధి

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:28 AM

Village Development Through Unanimous Decisions ఏకగ్రీవాలతో పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను పెంచిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గ్రామ ప్రజలు, పెద్దలు పరస్పర అంగీకారంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌, వార్డు సభ్యులను ఎన్నుకోవాలని సూచించారు.

  Unanimous Decisions    ఏకగ్రీవాలతో పల్లెల అభివృద్ధి
మాట్లాడుతున్న‌ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఏకగ్రీవాలతో పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను పెంచిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గ్రామ ప్రజలు, పెద్దలు పరస్పర అంగీకారంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌, వార్డు సభ్యులను ఎన్నుకోవాలని సూచించారు. అయితే ఈ ప్రక్రియలో ఎవరిపైనా ఎటువంటి బలవంతం, ఒత్తిడి ఉండకూడదని స్పష్టం చేశారు. 5వేల లోపు జనాభా ఉండే గ్రామాలకు రూ.15 లక్షలు, 10 వేలు వరకు జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలు పైబడి జనాభా ఉన్న గ్రామాలకు ఏకంగా రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక నిధులును అందిస్తుందన్నారు.

జపాన్‌ పర్యటనకు..

దేశంలో 18 మంది ఐఏఎస్‌ బృందంతో కలిసి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి జపాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. నీతి ఆయోగ్‌, జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ సంయుక్తంగా నిర్వహించే పర్యటనకు ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా నుంచి ప్రయాణమయ్యారు. సాంకేతిక విద్య, ప్రజారోగ్యం, వ్యవసాయ ఆధునికీకరణ , గ్రామీణాభివృద్ధి, పరిపాలనా విధానాలపై అధ్యయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Nov 14 , 2026 | 12:28 AM