Share News

దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:42 AM

ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు గురువారం భోగాపురం, సవరవల్లి గ్రామాల్లోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు.

దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

  • గ్యాస్‌ సిలిండర్ల సీజ్‌

భోగాపురం, మార్చి 12(ఆంధ్ర జ్యోతి): ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు గురువారం భోగాపురం, సవరవల్లి గ్రామాల్లోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. సవరవల్లి గ్రామంలో మణికంఠ ఫుడ్‌బేకరీ షాపులో తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలకు విరుద్ధం గా ఉన్న 13 డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను, భోగాపురం అపర్ణ హోటల్‌లో 3 డొమె స్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను గుర్తించి, సీజ్‌ చేశారు. 6ఏ కేసు నమోదు చేశారు. ఈ 16 సిలిండర్లను స్థానిక హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ సీఐ సింహాచలం, తహసీల్దార్‌ వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.

పూసపాటిరేగ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్న వ్యాపారులపై రెవెన్యూ, విజిలెన్స్‌ శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. శ్రీలక్ష్మీదేవి ఫ్యామిలీ రెస్టారెంట్‌ వద్ద 4 గ్యాస్‌ సిలిండర్లు, శ్రీవెంకటసాయి దుర్గ హోటల్‌ వద్ద నుంచి 3 గ్యాస్‌ సిలిండర్లు పట్టుకుని సీజ్‌ చేశారు. యజమానులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఆర్‌ఐ మాధురి, విజిలెన్స్‌ సీఐ సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:42 AM