కిరాణా దుకాణాల్లో విజిలెన్స్ దాడులు
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:51 PM
పట్టణంలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.
బెలగాం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నిత్యావ సర సరుకులు ధరలు పెరుగుతున్న నేపఽథ్యంలో విజిలెన్స్, లీగల్ మై ట్రోలజీ అధికారులు సంయుక్తంగా పట్ట ణంలోని గ్రంథి బదరి నారా యణ్ రైస్ షాప్, రాధాకృష్ణ కిరాణా అండ్ జనరల్ స్టోర్, మైత్రి డిపార్ట్ మెంటల్ స్టోర్, రామ్‌దేవ్ కిరాణా అండ్ జనరల్ స్టోర్, శ్రీనివాస ట్రేడర్స్, శ్రీవెంకట బాలాజీ ట్రేడింగ్ కంపెనీ, గణేష్ మెహర్ ట్రేడింగ్ అండ్ కో, గాయత్రీ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లను తనిఖీలు చేశారు. దుకాణ యజమానులు అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించిన మూడు దుకాణాలపై లీగల్ మెట్రోలజీ చట్టం ప్రకారం కేసు లు నమోదు చేసి రూ.12,500 విలువైన 126 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్, ఎస్‌ఐ రామారావు, లీగల్ మెట్రోలజీ అధికారులు పాల్గొన్నారు.