Share News

Election Duties ఎన్నికల విధుల్లో అప్రమత్తత కీలకం

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:19 AM

Vigilance Is Crucial in Election Duties పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. ఎలక్షన్‌ విధులు, నిబంధనలతో రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ

 Election Duties ఎన్నికల విధుల్లో అప్రమత్తత కీలకం
పోలీస్‌ అధికారుల హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ

బెలగాం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. ఎలక్షన్‌ విధులు, నిబంధనలతో రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ, మారుమూల గ్రామాల భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అక్కడ ఎన్నికల నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, రవాణా, సమాచార వ్యవస్థ, కమ్యూనికేషన్‌, భద్రతా సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. చెక్‌లిస్టులు, కమాండ్‌ వ్యవస్థ, నివేదిక సమర్పణ విధానం, సంబంధిత చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యూలర్ల సూచికలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఏవిధంగా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. కార్తీకమాసం నేపఽథ్యంలో జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, నదీ తీరాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలు, ట్రాఫిక్‌ రద్దీ వంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శేషయ్య, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:19 AM