Share News

స్థానిక ఎన్నికల్లో విజయం తథ్యం

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:03 AM

త్వరలో జరగనున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు చెప్పారు.

 స్థానిక ఎన్నికల్లో విజయం తథ్యం
విజయనగరం రూరల్‌: మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం రూరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు చెప్పారు. బుధవారం విజయనగరం టీడీపీకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గతప్రభుత్వహయాంలో అప్రజాస్వామిక పద్దతుల్లో ఎన్నికలు జరిగాయ న్నారు. అనాడు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా చేశారని, అలా చేసిన వారిని అనాటి ముఖ్యమంత్రి జగన్‌ ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. ఇప్పు డేమో ఏకగ్రీవాలు కాకుండా చూడాలని వైసీపీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారన్నారు. అప్పుడొక మాట..ఇప్పుడొక మాట ఆడుతున్న జగన్‌ దీ ద్వంద్వవైఖరని పేర్కొన్నారు. మెగా డీఎస్సీకి సంబంధించి జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారం అవాస్తవాలన్నారు. తాజాగా మరో సారి రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీలకు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫి కేషన్‌ ఇచ్చేందుకు సిద్దంచేస్తుందన్నారు. సమావేశంలో నాయకులు కనకల మురళీమోహన్‌, ముద్దాడ చంద్రశేఖర్‌, కోదండరామ్‌ పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌ కుటుంబానికి పరామర్శ

గుర్ల, ఆగస్టు26(ఆంధ్రజ్యోతి): భూపాలపురానికి చెందిన కానిస్టేబుల్‌ రమణ కుటుంబాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పరా మర్శించారు. ఇటీవల కొండకరకం వద్ద జరిగిన జీపు బోల్తాపడడంతో కానిస్టేబుల్‌ రమణ మృతిచెందిన విషయం విదితమే. కార్యక్రమంలో బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సన్యాసి నాయు డు, చీర సత్యం, రామ్మూర్తి, కోట్ల రామనాయుడు, త్రినాథ పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:03 AM