స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే శిరీష
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:05 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, ఆ ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాల తరహాలో కూటమి నాయకులంతా అన్ని స్థానాల్లో గెలుపొందాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.
పలాస, జూన్ 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, ఆ ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాల తరహాలో కూటమి నాయకులంతా అన్ని స్థానాల్లో గెలుపొందాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శిరీష మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో మంచి పాలన అందించారని ఇప్పటికీ చెప్పుకుంటున్నామని అన్నారు. ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తొక్కారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పలాస నియోజవర్గంలో అభివృద్ధి లేకుండా చేయడంతో పాటు అరాచక పాలన సాగించారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందించేది ఒక్క కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గౌతు కుటుంబాన్ని మాజీ మంత్రి విమర్శించడం సిగ్గుచేటని, ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. పలాస ఎయిర్‌పోర్టుకు అంతా సహకరిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలు వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, మల్లా శ్రీనివాస్, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, ఎం.నరేంద్ర, టంకాల రవిశంకర్‌గుప్తా, శాసనపురి మురళీకృష్ణ, ఆళ్ల కృష్ణారావు, రామానందస్వామి పాల్గొన్నారు.