Share News

Victory in local elections is the goal. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:58 PM

Victory in local elections is the goal. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని కూటమి సమన్వయ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు విజయనగరంలోని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు క్యాంపు కార్యాలయం వద్ద కూటమి నాయకులు శనివారం ఉదయం 10 గంటలకు సమావేశమయ్యారు.

Victory in local elections is the goal. స్థానిక ఎన్నికల్లో   విజయమే లక్ష్యం
సమన్వయ కమిటీ సమావేశంలో కూటమి నేతలు

స్థానిక ఎన్నికల్లో

విజయమే లక్ష్యం

అధిష్టానాల నిర్ణయమే శిరోధార్యం

స్థానిక ఎన్నికల్లో 100 స్టైక్‌రేట్‌ వస్తుంది

రాజ్యసభ సభ్యుడు విజయ్‌, కూటమి నాయకులు

విజయనగరం/ రూరల్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని కూటమి సమన్వయ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు విజయనగరంలోని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు క్యాంపు కార్యాలయం వద్ద కూటమి నాయకులు శనివారం ఉదయం 10 గంటలకు సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు, స్థానిక సంస్థల ఎన్నికల టీడీపీ ఇన్‌చార్జి చింతకాయల విజయ్‌, జనసేన తరపున తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పాలవలస యశస్వి, గురాన అయ్యలు, భారతీయ జనతాపార్టీ తరుపున రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావనీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌వర్మ, జనసేన రాష్ట్ర నాయకుడు విశ్వక్‌సేన్‌ తదితరులు సమావేశమయ్యారు. విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ తదితర ఎన్నికలకు సంబంధించి వీరంతా చర్చించారు. కూటమి పార్టీల బలబలాల గురించి మాట్లాడారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో కూడా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో సాగాలని నిర్ణయించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది రాష్ట్రస్థాయిలో అధినేతలు నిర్ణయించిన తరువాత మరోసారి జిల్లా స్థాయిలో చర్చిద్దామని తీర్మానించారు. సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ మాట్లాడుతూ, తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకం అవుతానన్నారు. కింది స్థాయి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని రాష్ట్ర పార్టీకి నివేదిస్తానన్నారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూటమి ఏ విధంగా విజయం సాధించిందో? అదే స్థాయిలో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో త్వరలో మరోసారి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని, మరింత లోతుగా చర్చిస్తామన్నారు. గొడ్డలి పార్టీనేత జగన్మోహన్‌రెడ్డి అఽధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను ప్రోత్సహించారని, స్థానిక ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీలను నామినేషన్‌ వేయకుండా చేశారన్నారు. ఇప్పుడేమో ఏకగ్రీవాలు జరిగితే సహించేది లేదని, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వబోనని వైసీపీ నేతలను బెదిరించే స్థాయికి దిగజారారన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే, జనసేన పార్టీ స్థానిక సంస్థల (విజయనగరం, శ్రీకాకుళం) జిల్లాల ఇన్‌చార్జి లోకం నాగమాధవి మాట్లాడుతూ, కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను రాష్ట్ర నేతలకు నివేదించనున్నామన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా వున్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌ వర్మ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల్లో కొనసాగిన జైత్రయాత్ర, స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్నారు. రెండున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కూటమి అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తాయన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:58 PM