Share News

very hot ఎండలు బాబోయ్‌

ABN , Publish Date - May 19 , 2026 | 12:05 AM

very hot జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చాలా మండలాల్లో సోమవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల నుంచి 4 వరకూ వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

very hot ఎండలు బాబోయ్‌
నిర్మానుష్యంగా విజయనగరం ఎన్టీఆర్‌ సర్కిల్‌

ఎండలు బాబోయ్‌

విజయనగరం, మే 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చాలా మండలాల్లో సోమవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల నుంచి 4 వరకూ వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కూలీలు, రోడ్డు పక్కన వ్యాపారులు ఇబ్బందులు పడడం కనిపించింది. పశువులు, మూగజీవాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత మరో రెండు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తలకు టోపీ, గొడుగు వినియోగించా లంటున్నారు. వేసవి దృష్ట్యా అన్ని పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచినట్టు డీ ఎంహెచ్‌వో జీవనరాణి తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 12:05 AM