వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:53 AM
పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఆదివారం ప్రారంభమ య్యాయి.
బొబ్బిలి, జనవరి25 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఆదివారం ప్రారంభమ య్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాలపై మేళతాళాలతో స్వామివారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.