ఎద్దుల బండిని ఢీకొన్న వాహనం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:17 AM
గుర్తుతెలియని వాహనం ఎద్దుల బండిని ఢీకొన్న ఘటనలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు.
బాడంగి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వాహనం ఎద్దుల బండిని ఢీకొన్న ఘటనలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఇదే ఘటనలో ఓ ఎద్దు కూడా మృతిచెందింది. హెచ్‌సీ ప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని ముగడ నుంచి కూనాయవలస రహదారిలో ముగడ గ్రామానికి చెందిన మృత్స శత్రుజ్ఞ (51), ఆయన బావ తెంటు రాములు ఇద్దరు కలిసి రెండు నాటుబళ్లపై కర్రలు తీసుకొని వెళ్తున్నారు. శనివారం తెల్లవారు జామున మూడు గంటల సమయం లో ఆకులకట్ట సమీపంలో గుర్తుతెలియని వాహనం శత్రుజ్ఞ ఎడ్ల బండిని ఢీకొం ది. దీంతో శత్రుజ్ఞతో పాటు ఒక ఎద్దు అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి డీఎస్పీ భవ్యారెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఐ ప్రసాదరావులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెంటు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు. మృతునికి భార్య నారాయణమ్మ, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.