Share News

దారి తప్పి.. డివైడర్‌ను ఢీకొని

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:20 AM

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వచ్చి, తిరిగి రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో దారి తప్పి.. ద్విచక్రవాహనంతో డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు.

దారి తప్పి.. డివైడర్‌ను ఢీకొని

  • భోగాపురం సమీపంలో విశాఖ వాసి మృతి

భోగాపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వచ్చి, తిరిగి రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో దారి తప్పి.. ద్విచక్రవాహనంతో డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. భోగాపురం మార్కెట్‌ సమీప జాతీయ రహదారి ఎత్తు వంతెన పై సోమవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలి లా ఉన్నాయి. విశాఖ జిల్లా, భీమిలిపట్నం మండలం, పెదనాగ మయ్యపాలెం గ్రామానికి చెందిన బొడ్డు యల్లాజి(32) తగరపు వలస సమీప ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహి తుడి పుట్టినరోజు ఉందని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చాడు. రాత్రంతా వేడుకల్లో పాల్గొని, వేకువజామున తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరా డు. అయితే దారి తప్పి భీమిలి వైపు వెళ్లకుండా భోగాపురం వైపు వచ్చాడు. అతివేగంగా వస్తూ భోగాపురం మార్కెట్‌ సమీప ఎత్తుబ్రిడ్జిపై డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని, రోదించారు. మృతుడికి భార్య హేమ తోపాటు పాప, బాబు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పోస్టుమార్టు నిర్వహించకపోవడంతో కుటుంబీకులు అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:20 AM