వాలీబాల్ పోటీల్లో ‘వీరఘట్టం’ విజేత
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:46 PM
ఎ.వెంకంపేటలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలు స్మారక వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి.
మక్కువ రూరల్, జనవరి11 (ఆంధ్రజ్యోతి): ఎ.వెంకంపేటలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలు స్మారక వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో వీరఘట్టం జట్టు విజేతగా నిలిచింది. ఈనెల 8 నుంచి 10 వరకు నిర్వహించిన పోటీల్లో 48 జట్లు పాల్గొన్నాయి. సెమీ ఫైనల్స్‌కు 4 జట్లు చేరుకున్నారు. అందులో వీరఘట్టం, పెదఊట గెడ్డ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. రెండు జట్ల మధ్య జరిగిన హారాహారీ పోటీలో మొత్తం 5సెట్లకు గానూ 3 సెట్లను వీరఘట్టం కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. రెండో స్థానంలో మక్కువ మండలం పెదఊట గెడ్డ జట్టు, మూడో స్థానంలో బొబ్బిలి మండలం గునతోటవలస జట్టు నిలిచాయి. గెలుపొందిన జట్లకు సోమవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నట్టు టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలనాయుడు తెలిపారు.