వీబీజీ రామ్‌జీ పనుల పరిశీలన
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:44 AM
మెట్టవలస, కృష్ణాపురం గ్రామాల్లో చేపడుతున్న వీబీజీ రామ్‌జీ పనులను బుధవారం డ్వామా పీడీ ఎస్.శారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మెట్టవలస, కృష్ణాపురం గ్రామాల్లో చేపడుతున్న వీబీజీ రామ్‌జీ పనులను బుధవారం డ్వామా పీడీ ఎస్.శారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెట్టవలసలో చేపడుతున్న మల్లమ్మ చెరువు పనులు, కృష్ణాపురంలో ఫిష్‌పాండ్ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆమె వేతనదారులతో మాట్లాడారు. ప్రభు త్వం నిర్ధేశించిన సమయంలో పనులు చేపడుతూ రోజుకు రూ.312 గరిష్ఠ వేతనం పొందాలన్నారు. సమయపాలన పాటించకపోతే తక్కువ వేతనం వచ్చే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.రవికుమార్, ఏపీవో లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.