వ్యాన్ బోల్తా.. ఒకరి మృతి
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:16 AM
వ్యాన్ బోల్తా పడి ఒకరు మృతి చెంద గా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని శివలిం గాపురం సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఇద్దరికి తీవ్ర గాయాలు
పాచిపెంట, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): వ్యాన్ బోల్తా పడి ఒకరు మృతి చెంద గా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని శివలిం గాపురం సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన మండలం లోని గరెళ్లవలసకు చెందిన మంచాల గణేష్(22) మృతిచెందగా, అదే గ్రామానికి చెందిన కొనిస జమరాజు, కేసలికి చెందిన కొనిస వసంతరావులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్‌ఐ లాలం అర్జున కథనం ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా డ్రైవరు అజాగ్రత్త వల్ల వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్‌లో గల మంచాల గణేష్‌కు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం విజయనగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ మంచాల గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం జిలాలోని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. గణేష్ అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. గణేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.