Share News

స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్‌

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:09 AM

వర్షం కురుస్తుండడంతో తాటాకు టీకొట్టులో బుధవారం సాయంత్రం తలదాచుకున్న మహిళపై విద్యుత్‌ స్తంభం పడడంతో తీవ్ర గాయాలు కావడంతో పాటు మూడు బైకులు ధ్వంసమయ్యాయి.

  స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్‌
వ్యాన్‌ ఢీకొట్టడంతో స్తంభం పడడం వల్ల నుజ్జయిన బైక్‌లు

బొండపల్లి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): వర్షం కురుస్తుండడంతో తాటాకు టీకొట్టులో బుధవారం సాయంత్రం తలదాచుకున్న మహిళపై విద్యుత్‌ స్తంభం పడడంతో తీవ్ర గాయాలు కావడంతో పాటు మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఎస్‌ఐ యు.మహేష్‌ కథనం మేరకు.. మండలంలోని బిల్లలవలస జంక్షన్‌ వద్ద గల పూరిపాకలో నిర్వహిస్తున్న టీకొట్టుకు ఆనుకొని ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని మానాపురం వైపు నుంచి విజయనగరం వైపు పశువుల లోడుతో వెళ్తున్న వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి పడడంతో వర్షం వస్తుందని పాకలో ఉండి మూడు బైక్‌లను బయట పార్క్‌ చేయగా, వాటిపై పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో విజయనగరంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన రెడ్డి సింహాచలానికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 12:09 AM