Share News

బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్‌.. బాలుడి మృతి

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:44 AM

బైక్‌ను వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో పుల్లే రు గుడ్డివలస గ్రామానికి చెందిన బాలుడు చోడిపల్లి రాహుల్‌(9) బుధవారం మృతి చెందాడు.

 బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్‌.. బాలుడి మృతి

సాలూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): బైక్‌ను వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో పుల్లే రు గుడ్డివలస గ్రామానికి చెందిన బాలుడు చోడిపల్లి రాహుల్‌(9) బుధవారం మృతి చెందాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి కోనవలస వైపునకు కుటుంబ సభ్యులతో వెళుతున్న వ్యాన్‌.. కోనవలస నుంచి సాలూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న చోడిపల్లి రాహుల్‌ (9) అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ను నడుపుతున్న గిమ్మెల రమేష్‌, వెనుక కూర్చున్న చోడిపల్లి పరమేశులు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బొలేరో వాహనాన్ని నడిపిన విశ్వనాథపురం గ్రామానికి చెందిన వేముల కళ్యాణ్‌ పట్టణ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతిచెందిన రాహుల్‌, గెమ్మెల రమేష్‌, చోడిపల్లి పరమేవ్‌లతో సాలూరు మండలం పుల్లేరుగుడ్డివలసకు చెందిన వారు. ప్రస్తుతం ముత్యాలమ్మ గుడి వద్ద నివాసం ఉంటున్నారు. పట్టణ సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 12:44 AM