Share News

పశు వైద్య శిబిరాలను వినియోగించుకోండి

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:53 PM

రైతులు పశు వై ద్య శిబిరాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు.

పశు వైద్య శిబిరాలను వినియోగించుకోండి

  • రాజాం ఎమ్మెల్యే కోండ్రు

రాజాం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రైతులు పశు వై ద్య శిబిరాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. మంగళవారం నందబలగ గ్రామంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రా రంభించారు. అనంతరం చీపురుపల్లి రోడ్డులో లక్ష్మీగణ పతి ఆలయంలో పూజలు చేశారు. మెంతిపేట కాలనీ లో కాలువకు శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో కార్యాల యంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. అలాగే తొమ్మి ది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిష నర్‌ ఎ.రామచంద్రరావు. ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గురవాన నారాయణరావు, దుప్ప పూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి

వంగర, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ప్రజలు స్వచ్ఛరథా నికి చెత్తను అందజేసి, గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకో వాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో ఆయన స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ఎల్‌.కృష్టమూర్తి, ధనలక్ష్మి, ఎలకల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:53 PM