Share News

ఉపాధి పథకాన్ని వినియోగించుకోండి: ఎంపీ శ్రీభరత్‌

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:02 AM

ఉపాధి పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఎంపీ శ్రీభరత్‌ అన్నారు. కొలుకుపాలెం గ్రామంలో బుధవారం తాగునీటి పఽథకాన్ని ఎమ్మెల్యే లలితకుమారితో కలసి ఆయన ప్రారంభించారు.

ఉపాధి పథకాన్ని వినియోగించుకోండి: ఎంపీ శ్రీభరత్‌
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే లలితకుమారి తదితరులు

వేపాడ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఉపాధి పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఎంపీ శ్రీభరత్‌ అన్నారు. కొలుకుపాలెం గ్రామంలో బుధవారం తాగునీటి పఽథకాన్ని ఎమ్మెల్యే లలితకుమారితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాల్సి ఉండగా ఈ ప్రాంత ప్రజలు 40 రోజులు మాత్రమే వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రజలు అడుగు తున్నారని.. ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ రూ.220 కోట్లు జలజీవన్‌ మిషన్‌ నిధులతో తాగునీటి పథకాల పనులు చేపడుతున్నటు చెప్పారు. దబ్బిరాజుపేటలో తాగునీటి సమస్య ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని.. దీని పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శానాపతి లీల, అప్పారావు, మండల టీడీపీ అధ్యక్షుడు గొంప వెంకటరావు, ప్రధాన కార్యదర్శి కె.రమణమూర్తి, ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, సహకార సంఘ సభ్యుడు గుంటపల్లి దేముడుబాబు, గోగాడ జగన్నాథం నాయుడు, కూటమి నాయకులు అప్పారావు, సత్తిబాబు, లట్టాల పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 01:02 AM