Utilize Tatipudi water efficiently. తాటిపూడి నీటిని సమర్థంగా వినియోగించండి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:04 AM
Utilize Tatipudi water efficiently. తాటిపూడి రిజర్వాయర్ నీటిని సమర్థంగా వినియోగించి, ఆయకట్టు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం తన బస్సులో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో విజయనగరం కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పలు సూచనలు ఇచ్చారు.
తాటిపూడి నీటిని సమర్థంగా వినియోగించండి
ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
గంట్యాడ/భోగాపురం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): తాటిపూడి రిజర్వాయర్ నీటిని సమర్థంగా వినియోగించి, ఆయకట్టు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం తన బస్సులో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో విజయనగరం కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పలు సూచనలు ఇచ్చారు. తాటిపూడి రిజర్వాయర్ సామర్థ్యం 3.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 1.2 నుంచి 1.26 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పంటల ప్రణాళికను రూపొందించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసే విధానాలను అవలంభించాలని, సాగునీటి వినియోగంలో పొదుపు పాటించాలని చెప్పారు. తాటిపూడి నీటితో పాటు ఇతర నీటి వనరులను కూడా దృష్టిలో పెట్టుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం భోగాపురం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు కలెక్టర్‌తో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఎస్పీ ఏఆర్ దామోదర్, జీఎంఆర్ అధికారులు వీడ్కోలు పలికారు.
ఫ భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పనాయుడు ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ పర్యటన ముగించుకొని శనివారం భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన సందర్భంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిసి వీడ్కోలు పలికారు. ఇదే సమయంలో ఎయిర్‌పోర్టుకు బస్సుల గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీఎం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఎయిర్‌పోర్టు నుంచి బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు.