Share News

సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా వినియోగించండి

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:11 AM

సబ్‌ప్లాన్‌ నిధులను ఎస్సీ వర్గాల అభి వృద్ధికి సక్రమంగా వినియో గించాలని ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం అధికారులను ఆదేశించారు.

సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా వినియోగించండి
మాట్లాడుతున్న ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారాం

పాలకొండ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సబ్‌ప్లాన్‌ నిధులను ఎస్సీ వర్గాల అభి వృద్ధికి సక్రమంగా వినియో గించాలని ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పాలకొండలో పర్యటించారు. ఈ సం దర్భంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకొండ మున్సిపాలిటీకి సబ్‌ప్లాన్‌ కింద మంజూరైన రూ.50 లక్షల నిధులను రెల్లివీధి, కస్పావీధి, నాగవంశం వీధి సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేటాయించాలన్నారు. సుడా నుంచి కస్పావీధిలో అభివృద్ధి ప నుల కోసం రూ.35 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపాలిటీ అధికారులు లేఖ పంపించామని వెల్లడించారు. జీవో నెంబరు 52 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే గ్రాంట్లతో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున మొత్తం 21 శాతం నిధులను కేటాయించాలన్నారు. అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాధాకృష్ణమూర్తి, ఎస్‌ఐ వెంకన్న, ఇన్‌చార్జి ఎంపీడీవో రాముడు, నగర పంచాయతీ కమిషనర్‌ నూకరాజు, గ్రంథాలయాధికారి గణేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:11 AM