Share News

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:09 AM

విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

  • డిజిటల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

గంట్యాడ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గంట్యాడ మండ లం బుడతనాపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన డిజిటల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఆయన ఆదివారం ప్రా రంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేటీఎం సహకారంతో బీఆర్‌వీవీఎస్‌ స్వచ్ఛంద సంస్థ పది డెస్క్‌టాప్‌ కంప్యూటర్లతో ఈ డిజిటల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కంప్యూటర్‌ ని వినియోగించి ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచాన్ని అనుసం ధానం చేసుకోవచ్చన్నారు. డిజిటల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ విద్యార్థులకు ఎంతో ఉప యోగపడుతుందన్నారు. డీఈవో మాణిక్యం నాయు డు మాట్లాడుతూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ జిల్లాలో విద్యాభి వృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గోపాలరాజు, పేటీఎం అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ అంబూజ్‌ రస్తోగి, మేనేజరు సత్యనారాయణ, సీఈవో రామకృష్ణరాజు, ఎంఈవో వెంకటరావు, హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 12:09 AM