పట్టణాభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:06 AM
పట్టణాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
- స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలుపించుకోవాలి
- ఎమ్మెల్యే విజయచంద్ర
పార్వతీపురంటౌన్/బెలగాం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పట్టణాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం పట్టణంలోని 19వ వార్డు వైకేఎం కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.50లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి హయాంలో పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో తాగునీరు, పారి శుధ్యం నిర్వహణ, రహదారులు, కాలువల నిర్మాణం కోసం రెండున్నరేళ్లలో కోట్లా ది రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుందన్నారు. స్థానిక ఎన్నికల్లో ఆయా వార్డుల్లో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని అన్నారు.
సోలార్ విద్యుత్‌పై అపోహలు వద్దు
పార్వతీపురం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయచంద్ర పిలుపునిచ్చారు. నర్సిపురంలో శు క్రవారం నిర్వహించిన సేవా సేతు అభియాన్ అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. రూప్‌టాప్ సోలార్‌తో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ గొట్టాపు గౌరి, టీడీపీ మండల అధ్యక్షుడు భానుదేవి చంద్రమౌళి పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
సీతానగరం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇప్పలవలస గ్రామానికి చెందిన అలమండ సతీష్, మహాలక్ష్మి కుటుంబానికి మంజూరైన రూ.10 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్వయంగా బాధితుల గ్రామానికి వెళ్లి అందజేశారు. మహాలక్ష్మికి కవల పిల్లలు జన్మించగా, తీవ్ర అనారోగ్యంతో ఒక శిశువు మృతి చెందింది. మరో బిడ్డ వైద్యం కోసం రూ. 28 లక్షలు ఖర్చుచేసి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.10 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పెంట సత్యంనాయుడు, రౌతు వేణుగోపాల్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతిపత్రం
పార్వతీపురం రూరల్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తమ వేతనాలు పెంచాలని కోరుతూ వెలుగు వీవోఏలు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయచంద్రకు వినతిపత్రం అందించారు. సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు.