Urban Beautification is the Goal పట్టణ సుందరీకరణే లక్ష్యం
ABN , Publish Date - May 12 , 2026 | 11:52 PM
Urban Beautification is the Goal పార్వతీపురం సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో ప్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన మొక్కలు, గోడలకు వేసిన పెయింటింగ్స్, పలు చిత్రాలను పరిశీలించారు.
బెలగాం, మే12(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో ప్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన మొక్కలు, గోడలకు వేసిన పెయింటింగ్స్, పలు చిత్రాలను పరిశీలించారు. సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పార్వతీపురానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. మొక్కల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మొక్కల కుండీలకు ఆకర్ణణీయమైన రంగులు వేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ డి.పావని, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.