Share News

Gas Cylinders జాప్యం లేకుండా గ్యాస్‌ సిలిండర్ల సరఫరా

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:06 AM

Uninterrupted Supply of Gas Cylinders జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు జాప్యం లేకుండా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

 Gas Cylinders జాప్యం లేకుండా గ్యాస్‌ సిలిండర్ల సరఫరా
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు జాప్యం లేకుండా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎక్కడా గ్యాస్‌ కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సరఫరా స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్ల వార్డెన్ల, విద్యా సంస్థల నిర్వాహకులు ఎప్పటికప్పుడు నోడల్‌ అధికారితో సమన్వయం చేసుకోవాలని, గ్యాస్‌ లోటు లేకుండా చూసుకోవాలని తెలిపారు.

ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తు చర్యలు

వేసవిలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్ట్యా స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో ప్రధాన కూడళ్లలో చలివేం ద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పీహెచ్‌సీల్లో తగినన్ని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్‌ దిలీప్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:06 AM