Share News

రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:57 PM

కొత్తవలస-తుమ్మికాపల్లి మధ్యలో ఉన్న రైల్వేలైన్‌లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి నట్టు జీఆర్పీహెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.శ్రీనివాసప్రసాద్‌ తెలిపారు.

రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం

కొత్తవలస, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కొత్తవలస-తుమ్మికాపల్లి మధ్యలో ఉన్న రైల్వేలైన్‌లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి నట్టు జీఆర్పీహెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.శ్రీనివాసప్రసాద్‌ తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కొత్తవలస-తుమ్మికాపల్లి మధ్యలో ఉన్న రైలు పట్టాలపై ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్టు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని చెప్పారు. మృతుని ఎడమ చేయిపై కె.దేముడు అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడు 5.5 అంగుళాల పొడవు, చామన చాయ రంగు కలిగి, లేత నీలం రంగు నెక్‌ టీషర్డు వేసుకుని, ముదురు నీలం రంగు ఫ్యాంటు వేసుకున్నట్టు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. మృతుడు రైలులో నుంచి జారి మృతి చెందాడా.. రైలు కింద పడి మృతి చెందాడా.. అని తెలియ రావల్సి ఉందన్నారు. మృతుని వివరాలు తెలిసినట్టయితే 9247585742, 9440170317 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Updated Date - Jan 13 , 2026 | 11:57 PM