రైలుపట్టాలపై గుర్తుతెలియని మృతదేహం
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:15 AM
బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైలు పట్టాలపై గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించామని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ బండారు ఈశ్వరరావు తెలిపారు.
బొబ్బిలి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైలు పట్టాలపై గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించామని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ బండారు ఈశ్వరరావు తెలిపారు. సుమా రు 40 వయస్సు కలిగిన వ్యక్తి రైలు నుంచి జారిపడి గానీ, రైలు పట్టాలు దాటు తుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టడం వల్ల గానీ మృతి చెంది ఉండవచ్చని భావిసున్నామన్నారు. మృతుడు బిస్కెట్ కలర్ ఫుల్‌హేండ్స్ షర్ట్, కాఫీరంగు ప్యాంట్ ఽధరించి ఉన్నాడన్నారు. కుడికాలికి నల్లటి తాడు ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే విజయనగరం జీఆర్‌పీ ఎస్‌ఐ వి.బాలాజీరావు 9247585742, జీఆర్‌పీ హెచ్‌సీ బి.ఈశ్వరరావు 8309901038, 9247585745, 9494813163 నెంబర్లకు సమాచారం అందజేయాలని కోరారు.