Share News

చంపావతి నదిలో గుర్తుతెలియని మృతదేహం

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:12 AM

మండలంలో ని కోటగండ్రేడు గ్రామ సమీపంలో గల చంపావతి నదీ ప్రవాహంలో ఉన్న పంపుహౌస్‌ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నీటిలో తేలియా డుతూ స్థానికులకు కనిపించింది.

చంపావతి నదిలో గుర్తుతెలియని మృతదేహం

గుర్ల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలో ని కోటగండ్రేడు గ్రామ సమీపంలో గల చంపావతి నదీ ప్రవాహంలో ఉన్న పంపుహౌస్‌ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నీటిలో తేలియా డుతూ స్థానికులకు కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ నారాయణరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, ఎరుపురంగు బనియన్‌, బిస్కెట్‌ రంగు షర్టు, మోకాళ్ల వరకు ఉండే జీన్స్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121109443 నెంబర్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Updated Date - Sep 28 , 2026 | 12:12 AM