గింజేరు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:29 AM
మండలంలోని గింజేరు గ్రామానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న మామిడితోటలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం బయటపడింది.
గంట్యాడ ఆగస్టు 9(ఆంరఽధజ్యోతి): మండలంలోని గింజేరు గ్రామానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న మామిడితోటలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రహదారిపై రాక పోకలు సాగిస్తున్న ప్రయాణికులకు దుర్గంధం రావడంతో పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి పరిశీలించగా, మృతదేహం కనిపించింది. వెంటనే వారు గంట్యాడ పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ సాయికృష్ణ ఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించారు. మృతదేహాన్ని అక్కడ నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతుడి వివరాలు తెలియరాలేదు.