Share News

Unending Gas Troubles వీడని గ్యాస్‌ కష్టాలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:26 PM

Unending Gas Troubles పశ్చిమాసియాలో యుద్ధం తాత్కాలికంగా ఆగినా జిల్లాలో ఆ ప్రభావం ఇంకా ఉంది. ముఖ్యంగా ప్రజలను గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ల సరఫరాకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.

Unending Gas Troubles వీడని గ్యాస్‌ కష్టాలు
బైపాస్‌ రహదారిలో గ్యాస్‌ సిలిండర్ల కోసం పడిగాపులు కాస్తున్న వినియోగదారులు

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం తాత్కాలికంగా ఆగినా జిల్లాలో ఆ ప్రభావం ఇంకా ఉంది. ముఖ్యంగా ప్రజలను గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ల సరఫరాకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. అయినా జిల్లా కేంద్రంలో సిలిండర్ల కోసం వినియోగదారులు పాట్లు పడుతున్నారు. శనివారం పట్టణంలోని బైపాస్‌ రహదారిలో భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద సిలిండర్ల కోసం మండుటెండలో వినియోగదారులు పడిగాపులుకాశారు. గ్యాస్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికైనా గ్యాస్‌ కష్టాలను తొలగించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:26 PM