Share News

Unemployed youth rise up in protest కదంతొక్కిన నిరుద్యోగులు

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:16 AM

Unemployed youth rise up in protest నిరుద్యోగ యువత కదంతొక్కారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీని 2500 నుంచి 10000 పెంచాలన్న డిమాండ్‌తో జిల్లా కేంద్రంలో గురువారం ఆందోళనకు దిగారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కోట జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ ప్రదర్శన చేపట్టారు.

Unemployed youth rise up in protest కదంతొక్కిన నిరుద్యోగులు
: విజయనగరంలో ర్యాలీ చేస్తున్న నిరుద్యోగ యువత

కదంతొక్కిన నిరుద్యోగులు

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులను 10,000కు పెంచాలి

వయో పరిమితి సడలించాలంటూ నినాదాలు

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి):

నిరుద్యోగ యువత కదంతొక్కారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీని 2500 నుంచి 10000 పెంచాలన్న డిమాండ్‌తో జిల్లా కేంద్రంలో గురువారం ఆందోళనకు దిగారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కోట జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ ప్రదర్శన చేపట్టారు. ఆపై కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టలేదని, జిల్లా కేంద్రంలో సంవత్సరాలుగా గదులు తీసుకుని చదివామని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత జాబ్‌ క్యాలెండరు విడుదల చేసినప్పటికీ ఇందులో 2500 పోస్టులు చూపడం అన్యాయమన్నారు. కనీసం పది వేల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని కోరారు. జీవో నెంబరు 46 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో వేలామంది నిరుద్యోగులతో చలో విజయవాడ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అనంతరం డీఆర్‌వోకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నవీన్‌, ధర్మరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:16 AM