వరకట్న నిషేధ చట్టంపై అవగాహన
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:45 AM
ఎన్.కె.రాజపురంలో బుధవారం వరకట్న నిషేధ చట్టం 1961పై న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.హరిబాబు అవగాహన కల్పించారు.
పాలకొండ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఎన్.కె.రాజపురంలో బుధవారం వరకట్న నిషేధ చట్టం 1961పై న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.హరిబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ చట్టరీత్యా నేరమన్నారు. వరకట్నం వేధింపులు కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్టపరంగా కల్పిస్తున్న రక్షణ, అందుబాటులో ఉన్న న్యాయ సహాయ సేవలను వివరించారు. ఎన్‌ఎల్‌ఎస్‌ఏ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెన్నపు శ్రీనివాసరావు, నీలాపు శ్రీనివాసరావు, ప్యానెల్ న్యాయవాదులు బి.రామ్మోహన్‌రావు, ఎం.జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.