పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:20 AM
జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పార్వతీపురం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఆర్.కె.జూనియర్ కళాశాల, పీఎస్ వాసవీ జూనియర్ కళా శాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా, మాల్ ప్రాక్టీస్ తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు, గదుల్లోని ఇతర కనీస సదుపాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు కళాశాలల ప్రిన్సి పాల్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.