ఏకగ్రీవాలతో గ్రామాలకు ప్రయోజనం
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:22 AM
పంచాయతీ పాలక వర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవ డం వల్ల గ్రామాలకు మేలు జరుగుతుందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.
ఎమ్మెల్యే కళావెంకటరావు
చీపురుపల్లి, నవంబరు 16(ఆం ధ్రజ్యోతి): పంచాయతీ పాలక వర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవ డం వల్ల గ్రామాలకు మేలు జరుగుతుందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన చీపురుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల్లో రాజకీయ విబేధాలు, వ్యక్తిగత వైషమ్యాలు పక్కన పెట్టాల న్నారు. నాయకులు, ప్రజలు ఐక్యంగా ఉంటే పంచాయతీ కార్యవర్గాన్ని ఏకగ్రీవం ఎన్నుకోవడం సాధ్యమవుతుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుకోవచ్చునన్నారు. అదే విధంగా రాబోయే తుఫాన్ పట్ల రైతులు అప్రమత్తం గా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.