Share News

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:15 AM

మండలంలో కొండకిండాం గ్రామానికి చెందిన పెదమజ్జి గోపి(56) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

బొండపల్లి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలో కొండకిండాం గ్రామానికి చెందిన పెదమజ్జి గోపి(56) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండకిండాం మాజీ సర్పంచ్‌ పెదమజ్జి ఆదిలక్ష్మి భర్త గోపి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బం దులతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆదివారం ఇంటిలో ఎవరులేని సమ యంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబీ కులు విజయనగరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:15 AM