Share News

అనారోగ్య సమస్యలు భరించలేక..

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:08 AM

మానసిక, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఓ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.

అనారోగ్య సమస్యలు భరించలేక..

  • మహిళ ఆత్మహత్య

దత్తిరాజేరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మానసిక, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఓ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పెద మానాపురం ఎస్‌ఐ కళాధర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వంగర పంచాయతీ ముద్దానపేట గ్రామానికి చెందిన పిట్టా అశ్వని(31) అనే మహిళ అనారోగ్య, మానసిక సమస్యలతో బాధపడుతూ గత కొన్ని సంవత్సరా లుగా విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం రోజురోజుకు విషమిస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈనెల 10వ తేదీ ఉదయం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. వాం తులు చేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి ఆమె మృతిచెందింది. మృతురాలికి భర్త పిట్టా వాసుదేవరావుతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 14 , 2026 | 12:08 AM